సన్నీతో విరాట్‌ కోహ్లీ.. వైరల్‌ వీడియో

అదేంటీ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉండే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉన్నాడేంటి..? ఈ వీడియో చూసిన చాలా మంది ఇలాగే అనుకున్నారు. అసలేం జరిగిందంటే.. సన్నీ లియోనీ ఆదివారం ఉదయం తన మేనేజర్‌ సన్నీ రజానీతో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. రజానీ చూడటానికి అచ్చం కోహ్లీలాగే ఉన్నాడు. దాంతో అక్కడే ఉన్న ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ నిజంగానే కోహ్లీ వచ్చాడనుకుని పొరబడ్డారు. ఆయనే కాదు అక్కడున్న మీడియా ప్రతినిధులూ అదే అనుకున్నారు. దగ్గరికెళ్లి చూస్తే కానీ తెలియలేదు అతను కోహ్లీ కాదు.. సన్నీ మేనేజర్‌ అని.

ఈ వీడియోను విరాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతన్ని చూసి కోహ్లీ మ్యాచ్‌ కోసం ముంబయి వచ్చాడనుకున్నాను’ అని కామెంట్‌ చేశారు. ఈ వీడియోపై రజానీ స్పందిస్తూ.. ‘చక్కటి కాంప్లిమెంట్‌ (కోహ్లీతో పోల్చడాన్ని ఉద్దేశిస్తూ) ఇచ్చినందుకు థాంక్స్‌ విరాల్‌’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో ఎంత వైరల్‌ అయిందంటే.. మూడు గంటల్లోనే దాదాపు 80వేల మందికి పైగా వీక్షించారు. అయితే కొందరు ఆకతాయిలు.. కోహ్లీ సన్నీతో ఉన్నాడని కామెంట్లు చేస్తూ.. ఆయన సతీమణి అనుష్క శర్మకు ట్యాగ్స్‌ కూడా చేశారు

CLICK HERE!! For the aha Latest Updates