
Virat Kohli – Avneet Kaur:
ఇంతకీ ఎవరీ అవ్నీత్? ఆమె 23 ఏళ్ల చిన్నవయసులోనే పెద్ద క్రేజ్ సంపాదించుకున్న యాక్ట్రెస్, డ్యాన్సర్, ఇన్‌ఫ్లూయెన్సర్. పంజాబ్‌లో జన్మించిన ఆమె, 8 ఏళ్లకే ‘డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్’ ద్వారా టీవీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘మెరి మా’, ‘చంద్రనందిని’ వంటి సీరియల్స్‌లో నటించింది.
అవ్నీత్‌కి పెద్ద బ్రేక్ వచ్చిందంటే – అలాదిన్ – నామ్ తో సునా హోగా సీరియల్‌లో ‘యాస్మిన్ ప్రిన్సెస్’ పాత్ర ద్వారా.
అలానే బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. ‘మర్దానీ’లో చిన్న పాత్రలో, ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్దీకి సరసన ‘టికూ వెడ్స్ షేరు’లో నటించింది. ఇటీవల ‘Party Till I Die’ అనే మూవీతో కనిపించింది. ఇక 2024 కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘Love in Vietnam’ అనే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది.
ఇక సోషల్ మీడియాలో ఆమె ధమాకా సెపరేట్ గానే ఉంది! అవ్నీత్ కౌర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 32 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యాషన్ స్టైల్స్, గ్లామర్ ఫొటోషూట్లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.
కోహ్లీ లైక్ తర్వాత, నెటిజన్లు అనుష్కను ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ కూడా పెట్టారు. దీనిపై విరాట్ వెంటనే స్పందించాడు. “ఫీడ్ క్లియర్ చేస్తుండగా అల్గోరిథం వల్ల తప్పుగా లైక్ అయిందేమో. దయచేసి ఊహాగానాలు చేయకండి,” అని క్లారిటీ ఇచ్చాడు.
అయితే, ఈ చిన్న సంఘటనతో అవ్నీత్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది!
ALSO READ: Prabhas సినిమా చూపించినందుకు కొడుకుని క్షమాపణలు కోరిన Saif Ali Khan