ఇస్మార్ట్ శంకర్ టీజర్ విడుదల


ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో “ఇస్మార్ట్‌ శంకర్” రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. “పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌” అని రామ్‌ స్టయిల్‌గా తన పేరు చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. డ్యాన్స్‌, ఫైట్ సన్నివేశాల్లో రామ్‌ స్టైలిష్‌గా కనపడుతున్నాడు. “నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగిట పొట్టేలుని కట్టేసినట్లే.” అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌ అవుతుంది.

 

ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్‌, నభాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం. జులై మొదటివారంలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.