బాలయ్య గ్యాంగ్ స్టర్ అవతారం!

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా అనగానే చాలా మందికి అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని ఆలోచించారు. హీరోయిజాన్ని నమ్ముకునే పూరి, బాలయ్యను ఎలా చూపిస్తాడా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా పూరి ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందో.. రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు.

రెగ్యులర్ సినిమాల మాదిరి ఈ సినిమా ఉండదని డిఫరెంట్ గా ఉంటుందని వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ అంటే కబాలి సినిమా గుర్తొస్తుందని అసలు దీనికి కబాలికి ఎలాంటి పోలిక ఉండదని వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ముస్కాన్ అనే అమ్మాయిని ఫైనల్ చేసినట్లు అగ్రిమెంట్ మీద సైన్ చేయించినట్లు తెలుస్తోంది. అలానే మరో ఇద్దరు హీరోయిన్స్ ను ఫైనల్ చేయబోతున్నారు. మరి బాలయ్య గ్యాంగ్ స్టర్ గా ఏ మేరకు మెప్పిస్తాడో.. చూడాలి!