గులాబీ కాంబినేషన్ మళ్ళీ!

కృష్ణవంశీ రూపొందించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘గులాబీ’. జె.డి.చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు కలిసి ఓ సినిమా కోసం పని చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే కృష్ణవంశీ ప్రస్తుతం ‘నక్షత్రం’ సినిమా కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

సాధ్యమైనంత తొందరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనేది కృష్ణవంశీ ప్లాన్. ఇప్పటికే ఈ సినిమాలో సందీప్ కిషన్, రేజీనా, సాయి ధరం తేజ్, ప్రగ్యా జైస్వాల్ వంటి తారలు నటిస్తున్నారు.

ఇప్పుడు వీరితో పాటు సినిమాలో ఓ ముఖ్య పాత్రలో జె.డి.చక్రవర్తి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణవంశీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే జె.డి ఈ పాత్రకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోలీసుల జీవితాల నేపధ్యంలో జరుగుతుంది.