అమితాబ్ స్థానంలో కృష్ణంరాజు!

బాలకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్ లో ‘రైతు’ అనే సినిమా రూపొందనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను సంప్రదించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వెల్లడించారు. ఆ పాత్ర ఆయన అంగీకరిస్తేనే సినిమా ఉంటుందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు అమితాబ్ కు బదులుగా కృష్ణంరాజుని తీసుకోవాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో ఆయనొక తెలుగు సినిమాకు డేట్స్ ఇస్తాడా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఆయనకు రీప్లేస్మెంట్ గా కృష్ణంరాజుని రంగంలోకి దింపనున్నారు. మరి కృష్ణంరాజు ఆ పాత్ర పోషిస్తే బాలయ్య సినిమాకు ఓకే చెప్తాడా..? లేక కృష్ణవంశీ ఏకంగా హీరోను కూడా మార్చేస్తాడెమో చూడాలి!