వర్మకి నిర్మాత దొరికాడు!

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించినప్పుడు ఆ సినిమాకు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ మాటల్లో నిజం లేదని బాలకృష్ణ వెల్లడించిన కొన్ని రోజులకే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో సినిమా ఉంటుందని వెల్లడించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన నేపధ్యం ఈ సినిమాలో కథ వస్తువుగా ఉంటుందని వెల్లడించారు. ఎన్టీఆర్ వంటి వ్యక్తిని ప్రభావితం చేసిన లక్ష్మి పార్వతి కోణంలో ఈ సినిమా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు నిర్మాతగా నటుడు జెడి చక్రవర్తి వ్యవహరించనున్నాడని సమాచారం.

రామ్ గోపాల్ వర్మకు జెడి చక్రవర్తికి మంచి సాన్నిహిత్యం ఉంది. శివ సినిమాతో జెడి చక్రవర్తిని నటుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసింది వర్మనే.. వర్మ సినిమాలతోనే జెడికి నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఈ కారణంగానే వర్మ సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!