జాను నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌


హీరో శర్వానంద్‌, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటగా నటిస్తున్న ‘జాను’ చిత్రం నుంచి మొదటి పాట వచ్చేసింది. ‘ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా.. గానం, తొలి గానం.. పాడే వేళ.. మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా..’ అంటూ మెలోడీగా సాగిన గీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. చిన్మయి, గౌతమ్‌ భరద్వాజ్‌ ఈ పాటను ఆలపించారు. గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చారు. ఈ వీడియోను సమంత సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు.

తమిళ హిట్‌ ’96’కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. రాజు, శిరీష్‌ నిర్మాతలు. పాఠశాలలో ఇష్టపడ్డ జంట అనేక ఏళ్ల తర్వాత మళ్లీ కలిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. తమిళ చిత్రం భారీ విజయం సాధించడంతో తెలుగు సినిమాపై మంచి అంచనాల నెలకొన్నాయి. విజయ్‌ సేతుపతి, త్రిష తమిళంలో నటించారు.