HomeTelugu Trendingఫేక్‌ ఎకౌంట్‌ నమ్మకండి.. గెటప్ శ్రీను వీడియో

ఫేక్‌ ఎకౌంట్‌ నమ్మకండి.. గెటప్ శ్రీను వీడియో

7 4

జబర్దస్త్ కామెడీ షో చూసే ప్రతీ ఒక్కరికి గెటప్ శీను సుపరిచితమే. విభిన్నమైన గెటప్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటాడు. బుల్లితెర కమల్ హాసన్ అంటూ నాగబాబు కూడా కొని సందర్భాల్లో అన్నారు. ఎప్పుడు సరదాగా ఉండే.. గెటప్ శీనుకు ఇప్పడు బాగా కోపం వచ్చింది. తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. వాళ్లను వదిలపెట్టనని.. పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.

ఇక విషయన్నికి వస్తే లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండి భార్యకు సాయం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కొందరు తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి వీడియోలన్నీ పోస్ట్ చేస్తున్నారని చెప్పాడు ఈయన. అలాంటి వాళ్ల పని పడతానంటున్నాడు ఈయన. ముఖ్యంగా తనకు కేవలం రెండు అకౌంట్స్ మాత్రమే ఉన్నాయని.. అందులో ఒకటి తన సొంత పేరుతో ఉన్న అకౌంట్ అయితే.. జబర్దస్త్ శ్రీనివాస్‌ అనేది మరొకటి అని చెప్పాడు.

ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఏవేవో వీడియోలు పెడుతున్నారని చెప్పాడు ఈయన. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తను ఈ విషయంపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు కూడా ఇస్తానంటున్నాడు. కేవలం తన అకౌంట్‌లో చెప్పినవి మాత్రమే నమ్మాలంటూ.. మిగిలిన అకౌంట్స్‌లో వచ్చినవి చూసి నమ్మొద్దంటూ కోరుకుంటున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu