HomeTelugu Big Stories'జబర్దస్త్' నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్!

‘జబర్దస్త్’ నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్!

Sudigali Sudheer out from j
జబర్దస్త్ కామెడీ షో సుడిగాలి సుధీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయ్యాడు సుధీర్‌. తాజాగా ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

జబర్దస్త్ షో నుంచి సుధీర్ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల్లో మంచి ఆఫర్లు రావడంతో డేట్స్ కాలిగా లేకపోవడంతో ఈ షో నుంచి తప్పుకోవాలి అని సుధీర్ నిర్ణయించుకున్నాడట.. ఇటీవల జబర్దస్త్ అగ్రిమెంట్ లో కూడా అతను సంతకం పెట్టలేదని తెలుస్తోంది. ఇతనితో పాటు స్నేహితులైన గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని టాక్‌. ఇక ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతే కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ విషయమై సుధీర్ స్పందించాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu