మరో 3 పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలు ప్రకటించిన జనసేన


పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలపై దృష్టిసారించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇందులో భాగంగా వివిధ విభాగాలతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తున్నారు. మంగళవారం నరసాపురం పార్లమెంట్‌కి కమిటీని ప్రకటించిన జనసేనాని ఇవాళ… శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గాలకు కమిటీలను నియమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కమిటీల జాబితా ఈ విధంగా ఉంది.

మరో 3 పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలు ప్రకటించిన జనసేన
పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలపై దృష్టిసారించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇందులో భాగంగా వివిధ విభాగాలతో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలను నియమిస్తున్నారు. మంగళవారం నరసాపురం పార్లమెంట్‌కి కమిటీని ప్రకటించిన జనసేనాని ఇవాళ… శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గాలకు కమిటీలను నియమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కమిటీల జాబితా ఈ విధంగా ఉంది.

జనసేన శ్రీకాకుళం పార్లమెంటరీ కమిటీ

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీల నియామకంలో భాగంగా శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా శ్రీ టి. శివ‌శంక‌రరావు, కార్యదర్శిగా డా.శ్రీ బొడ్డేప‌ల్లి శ్రీరామ్మూర్తి , ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా శ్రీ కూరాకుల యాద‌వ్‌, శ్రీ మైల‌ప‌ల్లి శ్రీనివాస‌రావు,
శ్రీ ధ‌ర్మాన ఉద‌య్‌భాస్క‌ర్‌, శ్రీ బ‌డ‌న వెంక‌ట జ‌నార్ధ‌న్‌రావు, వైస్ చైర్మన్ గా శ్రీ పెడాడ రామ్మోహ‌న్‌, కోశాధికారిగా శ్రీ గేదల శంక‌ర్‌రావు, అధికార ప్రతినిధులుగా శ్రీ సంతోష్ పాండ‌, శ్రీ ముడిదాన రామ్‌ప్ర‌సాద్‌లను నియమించారు. లీగల్ విభాగానికి శ్రీ బి. ఫల్గుణ‌రావులను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా
సభ్యులను ఎంపిక చేశారు.

జనసేన విశాఖ‌ప‌ట్నం పార్లమెంటరీ కమిటీ

విశాఖ‌ప‌ట్నం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని పవన్ నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా శ్రీ కోన తాతారావు, కార్యదర్శిగా శ్రీ బొల్లిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్గనైజింగ్ కార్యదర్శులు గా శ్రీ ఎం. రాఘ‌వ‌రావు, శ్రీ బొగ్గు శ్రీనివాస‌రావు, శ్రీ తిప్ప‌ల ర‌మ‌ణారెడ్డి, శ్రీ గ‌డ‌సాల అప్పారావు, శ్రీ అలివ‌ర్ రాయ్‌, వైస్ చైర్మన్ గా శ్రీ పి.వి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, కోశాధికారిగా శ్రీ తోట స‌త్య‌నారాయ‌ణ‌, అధికార ప్రతినిధులుగా శ్రీ యు .ప్ర‌వీణ్‌బాబు, శ్రీ చోడిపిల్లి ముస‌ల‌య్య‌లను నియమించారు. సిటిజ‌న్‌ కౌన్సిల్ కి శ్రీ నండూరి రామ‌కృష్ణ‌, లీగల్ విభాగానికి శ్రీ వై. మార్కండేయ‌లను ఎంపిక చేశారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.

జనసేన రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ

రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి కమిటీని పవన్ కల్యాణ్ నియమించారు. ఈ కమిటీకి రీజనల్ సెక్రటరీగా శ్రీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), కార్యదర్శిగా డా.ఆకుల సత్యనారాయణలను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీమతి కె.హారిక, శ్రీ ఎ.వి.ఎన్.ఎస్.రామచంద్ర రావు, వైస్ చైర్మన్ గా శ్రీ యర్నాగుల శ్రీనివాసరావు, కోశాధికారిగా శ్రీ సూరంపూడి పోలరాజు, అధికార ప్రతినిధులుగా శ్రీ ద్వారంపూడి సతీష్ కుమార్ రాజా, శ్రీ జె.వి.సత్యనారాయణ, లీగల్ విభాగానికి శ్రీ తోరాటి వసంత రావులను నియమించారు. వీరితోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ, వర్కింగ్ కమిటీలకు కూడా సభ్యులను ఎంపిక చేశారు.