HomeTelugu Trending'జవాన్‌' తెలుగు ట్రైలర్‌

‘జవాన్‌’ తెలుగు ట్రైలర్‌

Jawaan Telugu Trailerబాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్ ఖాన్, తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో చేస్తున్న చిత్రం ‘జవాన్‌’. హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ సరికొత్త లుక్స్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా అన్ని భాషల్లో ఈ రోజు సినిమా ట్రైలర్స్ విడుదలయ్యాయి. ‘అనగనగా ఒక రాజు.. ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు’ అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన తెలుగు ట్రైలర్ థ్రిల్లర్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

జవాన్‌తో పాటు పలు పాత్రల్లో షారుక్ మెప్పించారు. ఈ ట్రైలర్ లో నయనతార, దీపిక పదుకొనె, ప్రియమణితో పాటు విలన్ విజయ్ సేతుపతి క్యారెక్టర్లు చూపెట్టారు. ఆయుధాల డీలర్ పాత్రలో సేతుపతి కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!