
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్నఈ చిత్రం బ్యాంకు మోసాల నేపథ్యంలో రూపొందుతోంది. తన తండ్రిని మోసం చేసిన వాళ్ల అంతు చూసే కొడుకుగా మహేష్ నటిస్తున్నారని సమాచారం. అయితే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ తండ్రి పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచించి జయరామ్ ను ఫైనల్ చేశారట. చేసిన్నట్లు తెలుస్తుంది.
మలయాళ సీనియర్ నటుడైన జయరామ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. గతేడాడి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి రామచంద్రగా నటించారు. ఆ సినిమాలో జయరామ్ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో.. ‘సర్కారు వారి పాట’లోనూ ఆయన్నే ఫాదర్ క్యారెక్టర్ కు తీసుకున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ గా కనిపించనున్నారట. మరి దీనిలో ఎంత వరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.













