HomeTelugu Trendingజేడి చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

జేడి చక్రవర్తికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

jd chakravarthy receives be

సినీ నటుడు జేడీ చక్రవర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యారు. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ విజయం సాధించింది.

ఈ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లోని నటనకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఓటీటీ ప్లే అనే సంస్థ ఈ అవార్డును అందించింది. దేశ వ్యాప్తంగా ఓటీటీ కంటెంట్ లో ఈ అవార్డులను ఇచ్చింది.

దయా వెబ్ సిరీస్ కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా జేడీ చక్రవర్తి, ఉత్తమ దర్శకుడిగా పవన్ సాధినేని అవార్డులకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను వారు అందుకున్నారు. ఈ సిరీస్‌లో యాంకర్‌ విష్ణు ప్రియా కూడా ఓ కీలక పాత్రలో నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!