HomeTelugu Trending'శేఖర్‌' సినిమాలో శివానీ

‘శేఖర్‌’ సినిమాలో శివానీ

shivani in her father Shek

రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. రాజశేఖర్‌ హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్‌’. ఇందులో రాజశేఖర్‌ కుమార్తె పాత్రలో శివాని నటించింది. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu