HomeTelugu Trendingఇతర హీరోలా డబ్బు కోసం టాలీవుడ్‌లో నటించను: బాలీవుడ్‌ హీరో

ఇతర హీరోలా డబ్బు కోసం టాలీవుడ్‌లో నటించను: బాలీవుడ్‌ హీరో

John abraham sensational co
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రస్తుతం ‘ఎటాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ డైరెక్షన్‌ లో వస్తున్న ఈసినిమాలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 1 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మూవీ యూనిట్‌ ప్రెస్ మీట్లతో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ అబ్రహం సౌత్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడూ తెలుగు సినిమాల్లో నటించను అని, తనకు ప్రాంతీయ బేధం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

మీరు సలార్ సినిమాలో నటిస్తున్నారట నిజమేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ .. నేను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదు. నాకు ప్రాంతీయ బేధం ఎక్కువ.. ప్రాంతీయ సినిమాల్లో నేను నటించను. ఇతర హీరోలు లాగా డబ్బు కోసం తెలుగు సినిమాల్లో నటించను. ఎన్నడు ఇతర భాషల్లో సహా నటుడు గా, సెకండ్ హీరోగా చేయను.. నేను హిందీ హీరోను.. హిందీలోనే సినిమాలు చేస్తాను.. ఏ ప్రాంతీయ సినిమాలోనూ నేను కనిపించేది లేదు. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో వివాదాస్పద వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!