నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.. వేడుకలకు దూరం

జూనియర్ ఎన్టీఆర్… బాల నటుడిగా రామాయణం సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకొన్నాడు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పనవసరం లేదు. అక్కడి నుంచి ఎన్టీఆర్ తన జైత్రయాత్ర కొనసాగించాడు. కెరీర్‌లో ఆది, సింహాద్రి, యమదొంగ, సాంబ, అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. టెంపర్ తరువాత ఎన్టీఆర్ కు ఓటమి లేదు.

ఇప్పుడు రాజమౌళితో తారక్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. చరిత్రాత్మక కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవరసాలను తనలో పలికించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడంతో సినిమాల్లో అది బాగా ఉపయోగపడింది. మంచి డ్యాన్సర్ కూడా. డైలాగ్స్ చెప్పడంతో సీనియర్ ఎన్టీఆర్కు ఏ మాత్రం తీసిపోడు. ఈరోజు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. మాములుగా ఎన్టీఆర్ పుట్టినరోజును ఫ్యాన్స్ అద్భుతంగా జరుపుతుంటారు. కానీ, ఈ ఏడాది
ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉన్నాడు.