ఆ హీరోతో కాజల్‌ స్పెషల్‌ సాంగ్‌!

 

ప్రముఖ నటి కాజల్‌ మరో స్పెషల్‌ సాంగ్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె ‘జనతా గ్యారేజ్‌’ సినిమా కోసం తొలిసారి ప్రత్యేక గీతంలో సందడి చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె చిందేసిన ‘పక్కా లోకల్‌’ గీతం ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ కొత్త సినిమాలో ఆమె అలరించనున్నట్లు తెలుస్తోంది. బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. బన్నీ 19వ సినిమాగా ఇది రూపొందుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఇందులోని స్పెషల్‌ సాంగ్ కోసం దర్శక, నిర్మాతలు కాజల్‌ను కలిసినట్లు సమాచారం. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ‘ఆర్య 2’, ‘ఎవడు’ సినిమాల్లో బన్నీ, కాజల్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే.