క్రిష్ తో చరణ్ సినిమా..?

ప్రస్తుతం చరణ్ ‘దృవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్,
మణిరత్నం వంటి దర్శకులతో పని చేయనున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు లిస్ట్ లోకి
మరో దర్శకుడు చేరాడు. చిరంజీవి గతంలో నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’
సినిమాను ప్రెజంట్ ట్రెండ్ కు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసి ప్రేక్షకులకు అందించాలని
నిర్మాత అశ్వనీదత్ ఆలోచిస్తున్నాడట. ఈ విషయంపై ఆయన చిరుతో కూడా మాట్లాడారట.
ఆయన కూడా సంతోషంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ అయితే బాగా
హ్యాండిల్ చేయగలడని అతనికే ఈ ప్రాజెక్ట్ ను అప్పగించాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి
‘జగదేకవీరుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ తో చరణ్ సినిమా పూర్తయిన
వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.