హాలీవుడ్ కు వెళ్తోన్న నాగార్జున సినిమా!

అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఊపిరి’ సినిమా త్వరలోనే హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ది అప్ సైడ్’ అనే టైటిల్ తో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రెంచ్ లో తెరకెక్కిన ‘ది ఇన్‌టచబుల్స్’ సినిమాను తెలుగులో ‘ఊపిరి’ పేరుతో రీమేక్ చేయగా అది నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు 2016లో టాప్ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాను 
హాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. 
హాలీవుడ్ లో నాగార్జున పాత్రను బ్రియన్ క్రాన్‌స్టాన్ పోషిస్తుండగా, కార్తీ పాత్రలో కెవిన్ హార్ట్ నటిస్తున్నాడు. ఇక తమన్నా పాత్రలో హాలీవుడ్ బ్యూటీ నికోల్ కిడ్‌మన్ కనిపించనుంది. ఫ్రెండ్ లో సూపర్ సక్సెస్ అయిన ‘ది ఇన్‌టచబుల్స్’ సినిమా తెలుగు రీమేక్ కూడా మంచి విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్తోన్న ఈ రీమేక్ అక్కడ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి!