మెగా అల్లుడి రెండో చిత్రం!

మెగాస్టార్ అల్లుడి హోదాలో సినీ రంగప్రవేశం చేసిన కళ్యాణ్ దేవ్ తొలి సినిమా ‘విజేత’ తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు.