‘118’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 118. థ్రిల్లర్ వస్తున్న ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదల అయింది. 118 అనే సంఖ్యకు సినిమాకు సంబంధం ఏంటి అనే విషయం చుట్టూ కథ నడుస్తున్నట్టు ఆ టీజర్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల డేట్‌ని యూనిట్ ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 15 వ తేదీన సాయంత్రం 5:40 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారట. కళ్యాణ్ రామ్ మంచి హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. టీజర్ మెప్పించడంతో ట్రైలర్ ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.