ఆసక్తికరమైన టైటిల్‌ ‘118’ తో కళ్యాణ్‌రామ్

నటుడు కళ్యాణ్‌రామ్ హీరోగా కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘118’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నివేదా థామస్‌, షాలిని పాండే కథానాయికలుగా నటించారు. ఇదో ట్రెండీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని చిత్రబృందం వెల్లడించింది. జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates