లైవ్‌లో ఆత్మహత్యయత్నం చేసిన నటుడు


కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. దీంతో కొందరు ఆర్టిస్టులతో పాటు ఇతర టెక్నీషియన్లు కూడా ఉపాధి కోల్పోయి పూట గడవని పరిస్థితులకు చేరుకున్నారు.. ఈ సమయంలో కొందరు నటులు ఆర్థిక భారంతో ఆత్మహత్య యత్నం చేస్తుంటే మరి కొందరు మాత్రం భారంగా జీవితంను గడుపుతున్నారు. ఈ సమయంలోనే 31 ఏళ్ల బెంగాళి నటుడు సువి చక్రవర్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ సమయంలో నాకు డబ్బు ఇచ్చిన వారికి కనీసం సమాధానం చెప్పలేక పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

లైవ్ లో పలు విషయాల గురించి మాట్లాడిన ఆ నటుడు ఇండస్ట్రీలో చాలా మంది ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న నేనే జీవించాలని కోరుకోవడం లేదు అంటూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. లైవ్ లోనే అతడు తన వద్ద ఉన్న నిద్ర మాత్రలు అన్ని కూడా మింగేశాడు. బతికి ఉంటే మరో వీడియోలో కలుసుకుందాం అంటూ గుడ్ బై చెప్పేశాడు. అయితే లైవ్ చూసిన ఒక వ్యక్తి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో ఆ నటుడి ప్రాణాలు దక్కాయి. పోలీసులు వెంటనే స్పందించి అతడిని చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

CLICK HERE!! For the aha Latest Updates