HomeTelugu Big Storiesగంగవ్వపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

గంగవ్వపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

Karate kalyani sensational
తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి రెండోవారం ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన కరాటే కళ్యాణి బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌లో నటించాలి అని.. తాను నటించలేకపోయాను కాబట్టే ఇంట్లో ఉండలేకపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరికీ మాస్కులు ఉన్నాయని చెప్పింది. ఇక గంగవ్వ గురించి మాట్లాడుతూ.. అంతేకాదు చివరికి గంగవ్వ కూడా డ్రామాలు ఆడుతుందని.. ఆమెకు గేమ్ అర్థమైందని చెప్పింది కళ్యాణి. ఆమె కూడా మాస్కులోనే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

చాలా తెలివిగా గంగవ్వ అక్కడ ఆడుతుందని.. ఆమెకు తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పింది ఈమె. గంగవ్వకు ఏం తెలియదు అనుకుంటే అది మన పొరపాటే అంటుంది ఈమె. అయితే అమాయకంగా ఉండే గంగవ్వపై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం మండి పడుతున్నారు. ఆమెపై కూడా విమర్శలు చేయడం అవసరమా.. అలా అందరిపై నోరు పారేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చావు.. అయినా నువ్వు నీ.. బుద్ధి మార్చుకోలేదంటూ కళ్యాణిపై మండి పడుతున్నారు గంగవ్వ అభిమానులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu