దర్శకేంద్రుడికి మెహరీన్ ఏం నేర్పించింది?

హీరోయిన్‌ మెహరీన్‌.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు టీచర్‌గా మారారు. అదేంటి అంతపెద్ద దర్శకుడికి మెహరీన్‌ పాఠాలు చెప్పడమేంటి అనుకుంటున్నారా? అసలు విషయమిదీ..

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘f2’ మూవీ యాభై రోజుల మైలురాయి అందుకున్న సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్‌లో అర్థశత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెహరీన్‌, రాఘవేంద్రరావు మధ్య చోటుచేసుకున్న ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ చిత్రంలో ‘హనీ ఈజ్‌ ద బెస్ట్’ అంటూ తన ఫన్నీ మేనరిజంతో మెహరీన్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేనరిజాన్ని మెహరీన్‌.. రాఘవేంద్రరావుకు నేర్పించే ప్రయత్నం చేశారు. మరి ఆయన పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్నారో లేదో తెలీదు గానీ మెహరీన్‌ ఆయనకు నేర్పిస్తున్నప్పుడు తీసిన ఫొటోలు మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.