కార్తికేయ ‘గుణ 369’

యంగ్‌ హీరో కార్తికేయ కొత్త సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి ‘గుణ 369’ అనే టైటిల్‌ పెట్టారు. అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తిరుమల రెడ్డి, అనిల్‌ కడియాల సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కార్తికేయ విడుదల చేశారు. ట్విటర్‌ ద్వారా పోస్టర్‌ను షేర్‌ చేశారు. అందులో ఆయన సిక్స్‌ప్యాక్‌లో చొక్కా లేకుండా కనిపించారు. ‘మీకు నా వేసవి లుక్‌ నచ్చుతుందని ఆశిస్తున్నా. గుణ నా పేరు.. మరి 369 అంటే ఏంటి? తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఎదురుచూడండి, లేదా ఊహించండి..’ అని కార్తికేయ ట్వీట్‌ చేశారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత కార్తికేయ ‘హిప్పీ’ సినిమాలో నటించారు. జూన్‌ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇందులో దిగంగన హీరోయిన్‌గా నటించారు. జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రను పోషించారు. టి.ఎన్‌.కృష్ణ దర్శకుడు. ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్‌.థను సినిమాను నిర్మించారు.