HomeTelugu Trendingకార్తికేయ 'చావు కబురు చల్లగా'.. టీజర్‌

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’.. టీజర్‌

Chaavu kaburu challagaటాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్ తాజాగా కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో శేవలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’ లో ఆమని – శ్రీకాంత్ అయ్యంగర్ – మహేష్ – భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కార్తికేయ ఊర మాస్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరు ఆకట్టుకుంటున్నాయి.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu