
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన కొత్త సినిమా ప్రకటించాడు. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు టైటిల్ ను అనౌన్స్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాక్స్ దర్శకత్వంలో ఈ సినిమాను కలర్ ఫోటో సినిమాను నిర్మించిన బెన్నీ నిర్మిస్తున్నారు. ఈసినిమాకి ‘బెదురులంక 2012’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ.. అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ మాట్లాడుతూ.. మా హీరో కార్తికేయ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక విభిన్నమైన ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. ఒక పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. అక్కడ ఉన్న విభిన్నమైన వ్యక్తిత్వాలకు సంబంధించిన వారిని చూపిస్తూ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించామని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క వర్గం ప్రేక్షకులను మెప్పించే విధంగా.. ఒప్పించే విధంగా సినిమా ఉంటుంది అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.













