ఈసారి పవన్ పరువు పోవడం ఖాయం!

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల వచ్చిన నష్టాల్ని పూడ్చాలనే ఉద్దేశంతో కాటమరాయుడు సినిమా చేశాడు పవన్ కల్యాణ్. అయితే కాటమరాయుడు సినిమాను మాత్రం తక్కువ రేట్లకు కాకుండా మార్కెట్ రేటుకే అమ్మారు. దాదాపు 80 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ ను విక్రయించారు. కానీ ఇప్పుడు సినిమా 60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో బయ్యర్లు ఈసారి ఆందోళన చేసే అవకాశం ఉంది.

సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు ఎదురుచూసి నష్టాలు వస్తే గనుక నిర్మాతలను అడగాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే సర్ధార్ సినిమా విషయంలో కృష్ణాజిల్లా పంపిణీదారుడు నిరాహారదీక్ష చేశాడు. కాటమరాయుడు విషయంలో గానీ నష్టలొస్తే తెర వెనుక పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే ఈసారి పవన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. అందరిలో పవన్ పరువు పోతుంది. ఇదంతా జరగకుండా బయ్యర్లకు కొంతవరకు నష్టపరిహారం చెల్లిస్తే మంచిది.