HomeTelugu Trendingటైగర్‌-3: కత్రినా టవల్‌ ఫైట్ సీన్‌.. వైరల్‌

టైగర్‌-3: కత్రినా టవల్‌ ఫైట్ సీన్‌.. వైరల్‌

Katrina Towel fight hot top
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్‌ 3. మనీశ్‌ శర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్‌ డ్రామా లో కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి

ఈ చిత్రంలో కత్రినాకైఫ్‌పై వచ్చే యాక్షన్ సీన్‌పై ఇప్పుడు నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. కత్రినాకైఫ్ టవల్‌ ఫైట్‌ సీన్.. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎన్నడూ చూడని హాటెస్ట్‌ ఫైట్‌ సీన్‌గా నిలువడం ఖాయమని, థియేటర్లు స్టేడియంలా మారేందుకు ఈ ఒక్క సీన్‌ చాలు అని అంటున్నారు నెటిజన్లు.

టవల్‌ సీన్‌ మేకింగ్ స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా టికెట్‌ ప్రీ సేల్స్‌ను నవంబర్‌ 5న మొదలుపెట్టనున్నారు.

టైగర్‌ 3 మిడిల్ ఈస్ట్‌, నార్త్‌ అమెరికా, యూకే, యూరప్‌, ఆఫ్రికా దేశాల్లో నవంబర్‌ 11న విడుదల కానున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి లాంగ్ గ్యాప్‌ తర్వాత మరోసారి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!