హీరోగా కీరవాణి కుమారుడు

ప్రముఖ సంగీత దర్శకుడు, లెజెండరీ దర్శకుడు రాజమౌళికి పెద్ద అన్నయ్య ఎం.ఎం. కీరవాణి కుమారులు ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుల్లో ఒకరైన కాల భైరవ గాయకుడిగా మంచి పాటలు పాడి పాపులర్ అవగా ఇప్పుడు అయన ఇంకో కుమారుడు సింహ కోడూరి హీరోగా పరిచయం కానున్నాడు.

కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించనున్నాడు. ఇకపోతే సింహ గతంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘మర్యాద రామన్న’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించడం జరిగింది.