HomeTelugu Newsమరోసారి పవన్‌ సరసన కీర్తి సురేష్‌!

మరోసారి పవన్‌ సరసన కీర్తి సురేష్‌!

11 23
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జంట కోసం ఆ మధ్య పలువురి పేర్లు వినిపించాయి. క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ సినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ను ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఒక బాలీవుడ్ భామను తీసుకు వస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. కాగా ఈ సినిమాకు కీర్తి సురేష్‌ అయితే సరిగ్గా సెట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారట గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కీర్తిసురేష్ పవన్‌కు జత కట్టిన సంగతి తెలిసిందే. ఇక పవన్ క్రిష్ సినిమాను ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాలను నిర్మించిన ఏ. ఎం.రత్నం రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu