HomeTelugu Trendingప్రభాస్‌ ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా కీర్తిసురేష్

ప్రభాస్‌ ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా కీర్తిసురేష్

Keerthi suresh in prabhas a

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా ‘ఆదిపురుష్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సీరీస్ 350 కోట్ల బడ్జెట్టుతో ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు నిన్ననే వెల్లడయ్యాయి. ‘తానాజీ’ డైరెక్టర్‌ ‘ఓం రౌత్’ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పురాణ కథ ఆధారంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది.

విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి సాంఘిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. అంటే సోషియో ఫాంటసీగా కూడా వుండే అవకాశాలు వున్నాయని చెప్పచ్చు. ఇక ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం కీర్తి సురేశ్ పేరు పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే బాలీవుడ్ భామలు చాలామంది సీత రోల్‌ కోసం పోటీ పడుతుండగా.. ప్రభాస్ కూడా కీర్తివైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!