HomeTelugu Trending'మహాసముద్రం'లో కేజీఎఫ్‌ 'గరుడ' ఫస్ట్‌లుక్‌

‘మహాసముద్రం’లో కేజీఎఫ్‌ ‘గరుడ’ ఫస్ట్‌లుక్‌

KGF Garuda frist look from

టాలీవుడ్‌ డైరెక్టర్‌ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. విభిన్నమైన కథాకథనాలతో మల్టీ స్టారర్ గా నిర్మితమవుతోంది ఈ సినిమా. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో ‘ధనుంజయ్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. ఆయన పాత్రను .. ఆయన లుక్ ను పరిచయం చేస్తూ ఈ రోజున ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

‘గరుడ’ రామ్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందనేది ఈ పోస్టర్ ద్వారా హింట్‌ ఇచ్చారు. ‘కేజీఎఫ్’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ‘గరుడ’ రామ్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్‌ జరుపుకుంది. ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ ఉత్కంఠను పెంచుతున్నారు. జగపతిబాబు .. రావు రమేశ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu