ఖైదీకి ‘యు/ఏ’!

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ మీద మెరవనున్నారు. ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రంతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి రోజుకో పాటను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. జనవరి 4 న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా విజయవాడలో జరగనుంది. ఈరోజు ఈ సినిమా సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్ళింది. ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ ను పొందింది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు టాక్. తమిళంలో వచ్చిన ‘కత్తి’ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది.