చిరు గుంటూరుకి షిఫ్ట్ కావడానికి కారణం!

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు సంబంధించి పాటలను ఆన్ లైన్ లో విడుదల చేసి ప్రీరిలీజ్ ఫంక్షన్ ను మాత్రం విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా ఈ ప్రోగ్రాం విజయవాడ నుండి గుంటూరుకి షిఫ్ట్
అయినట్లు సమాచారం.

అసలు విషయంలోకి వస్తే ఫంక్షన్ చేయాలనుకున్న స్టేడియంను సినిమాల ఫంక్షన్స్ కోసం కాకుండా కేవలం స్పోర్ట్స్ కోసం వినియోగించాలని కోర్టు ఆర్డర్. దీన్ని ఉల్లంఘించి ఫంక్షన్ చేస్తే కోర్టుకు వెళ్లాలని కొందరు ఆలోచిస్తున్నట్లు టాక్. దీంతో ఆలోచనలో పడ్డ చిరు ఈ కార్యక్రమాన్ని విజయవాడకు బదులు గుంటూరులో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 7న గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ ఫంక్షన్ జరపనున్నట్లు సమాచారం.