పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదు .. కాకపోతే అది పక్కా


సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తరువాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించింది. గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది. ఆ తర్వాత ఇయర్ ఎండింగ్‌లో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు శృంగారం గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది. ఐతే.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అనుకుంటే నే రిలేషన్ షిప్‌ను కొనసాగిస్తానిని చెప్పింది. తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో లేనని చెప్పుకొచ్చింది. ఉన్నట్లయితే ఆ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ఎవరైనా తమను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని అనుకున్న తర్వాతనే రిలేషన్ షిప్‌ని మొదలుపెట్టాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. అలాగే ఒకిరిమీద ఒకరికి నమ్మకం ఉన్నపుడు పెళ్లికి ముందు కమిటైన తప్పులేదంది. అంతేకాదు పెళ్లికి ముందు కలిసి తిరిగినా తప్పులేదని చెప్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates