HomeTelugu News'కిన్నెరసాని' టీజర్‌

‘కిన్నెరసాని’ టీజర్‌

Kinnerasani Teaser
మెగా అల్లుడు హీరో క‌ల్యాణ్ దేవ్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘కిన్నెర‌సాని’. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ హీరో నితిన్‌ విడుదల చేశాడు.

‘మీ పాప ఓ అద్భుతం.. కానీ అద్భుతం జరిగే ప్రతీ చోట ఆపద ఉంటుంది’ అని ఓ అమ్మాయి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్‌కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. కెమెరామెన్ దినేష్ కె బాబు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ చేస్తుండగా.. అన్బు అరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

రవీంద్ర విజయ్, ఆన్ శీతల్, మహతి బిక్షు, కాశిష్ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu