త్రివిక్రమ్ అలాంటి టైటిల్ ను ఎన్నుకుంటాడా..?

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా టైటిల్ పై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి.’ఇంజనీర్ బాబు’,’గోకుల కృష్ణుడు’,’దేవుడు దిగివచ్చిన వేల’ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇదే టైటిల్ గా పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం చాన్సే లేదంటోంది. పవన్ కల్యాణ్ 25వ సినిమా అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇది తాము ప్రెస్టీజియస్ గా భావిస్తున్నామని, టైటిల్ కోసం త్రివిక్రమ్ ఎంతో ఆలోచిస్తున్నాడని అంటున్నారు.

టైటిల్ ఖచ్చితంగా అభిమానుల అంచనాలకు తీసిపోకుండా ఉంటుందని అంటున్నారు. రాజు వచ్చినాడో అనేది ఎన్టీఆర్ సినిమాలో ఓ పాట మకుటం. అలాంటిది త్రివిక్రమ్ దాన్ని టైటిల్ గా ఎన్నుకుంటారా అనేది అనుమానంగా మారింది. ఇప్పుడు యూనిట్ కూడా అదే అంటోంది. అసలు టైటిల్ వచ్చే వరకు ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ టైటిల్ ను
కూడా నమ్మే అవకాశాలు లేవు.