HomeTelugu Trending'సూపర్‌ మచ్చి' ట్రైలర్‌

‘సూపర్‌ మచ్చి’ ట్రైలర్‌

Super Machi Movie Trailer
మెగాస్టార్‌ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రచిత రామ్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి14వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. ఈ కథలోని వివిధ కోణాలను ట్రైలర్ ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ కథలో హీరోయిన్ ప్రేమని పొందలేకపోయిన అజయ్ .. విలన్ గా మారతాడని అర్థమవుతోంది.

రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, పోసాని, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. “వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా” అనే రాజేంద్రప్రసాద్ డైలాగ్ బాగా పేలింది. ఈ సినిమా కల్యాణ్ దేవ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu