అనుష్క న్యూ లుక్‌..

ప్రముఖ నటి అనుష్క అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు క్రేజ్‌ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్‌ తరువాత స్వీటి .. భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే మళ్లీ ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేకపోయారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు స్వీటి ఆసక్తి చూపింస్తుండగా.. కోన వెంకట్‌ చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పారు. ఈ మూవీలోని అనుష్క లుక్‌ను కోన వెంకట్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి క్రేజ్‌ను తీసుకువస్తుందో చూడాలి.