HomeTelugu Trendingపనిమనిషికి ఖరీదైన బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు

పనిమనిషికి ఖరీదైన బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు

Krishnam raju family celebrరెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘చిలుక గోరింక’ సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన కృష్ణంరాజు.. చివ‌ర‌గా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న రాధే శ్యామ్ సినిమాలోను కృష్ణం రాజు న‌టించాడ‌ని స‌మాచారం.

మ‌ర్యాద‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన కృష్ణం రాజు తాజాగా త‌న ప‌ని మ‌నిషికి బంగారు చైన్ బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ట‌. గ‌త 25 ఏళ్లుగా త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న ప‌ద్మ అనే మ‌హిళచే కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంత‌రం కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ఆమెకు బంగారు గొలుసు బ‌హుమ‌తిగా అందించింది.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ప్రభాస్ సోదరి ప్రసీద సోష‌ల్ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. దీంతో కృష్ణంరాజు దంప‌తుల‌పై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!