రెండేళ్ల తర్వాత ఈరోజే ప్రారంభించిన శృతి హాసన్‌

ప్రముఖ నటి శృతి హాసన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 2017లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె తర్వాత కనిపించలేదు. కాగా ఇప్పుడు తమిళ హీరో విజయ్‌ సేతుపతి నటిస్తున్న కొత్త సినిమాలో శృతి హీరోయిన్‌ పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు ‘లాభం‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా పూజలో దిగిన ఫొటోలను శృతి హాసన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఎగ్జైట్మెంట్‌ న్యూ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించా. నాకు ఎంతో ఇష్టమైన సహ నటుడు విజయ్‌ సేతుపతితో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. చిత్ర బృందం ఎంతో నచ్చింది. చాలా పాజిటీవ్‌గా, సరదాగా ఉన్నారు’ అని ట్వీట్లు చేశారు. మరోపక్క హిందీలో దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ తీయబోతున్న సినిమాలో శృతి నటించనున్నట్లు తెలుస్తోంది.