నా ఆరోగ్యం చాలా బాగుంది: కృష్ణంరాజు


సీనియర్‌ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కేవలం న్యూమోనియా చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్‌ పరీక్షల నిమిత్తం కేర్ ఆసుపత్రికి వెళ్లాను. అది చూసిన కొన్ని పత్రికల వారు విషయం తెలుసుకోకుండా వార్తలు రాశారు. ఇందువల్ల ఆసుపత్రిలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్‌ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్తాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.