HomeTelugu Big Storiesకృతిశెట్టి డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌.. నెటిజన్ల ప్రశంసలు

కృతిశెట్టి డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌.. నెటిజన్ల ప్రశంసలు

Krithi shetty kuchipudi dan
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది కృతిశెట్టి. ఈ సినిమా ఆమె నటనకు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కృతి గ‌తంలో ప‌లు యాడ్స్ చేసిన‌ప్ప‌టికీ ఎవ‌రికి అంత కనెక్ట్ కాలేక‌పోయింది. ఉప్పెన సినిమాతో ఆమె త‌ల‌రాత మారింది. వరుస సినిమాలతో బీజీగా మారిపోయింది. ఆమె ప్ర‌స్తుతం నాని ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో న‌టిస్తుంది. అలానే రామ్ పోతినేని, లింగుసామి దర్శకత్వంలో రూపొంద‌నున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.

ఇక సుధీర్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శివ‌రాత్రి సంద‌ర్భంగా కృతిశెట్టి.. స్పెష‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఈశ్వ‌ర అంటూ సాగిన ఈ పాట‌కు చాలా అద్భుతంగా నర్తించింది. కృతిశెట్టి టాలెంట్‌ చూసిన నెటిజ‌న్స్‌, పలువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!