తనయుడితో కేటీఆర్‌ .. ఫొటో వైరల్‌

గత నెల రోజులుగా సార్వత్రిక ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా గడిపిన రాజకీయ నాయకులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. ఫలితాలకు చాలా సమయం ఉండటంతో ఎక్కువ సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. ఆయన తనయుడితో కలిసి దిగిన ఒక ఆసక్తికర ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘మీకొక 13 ఏళ్ల కుమారుడు ఉంటే, అతను మీకన్నా ఎత్తుగా ఉంటే, తన నుంచి కోరుకునేది ఒక్కటే.. ఆత్మీయమైన ఆలింగనం’ అంటూ అని తన కుమారుడిని రెండు చేతులతో ఆలింగనం చేసుకున్న ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. గతంలో కేసీఆర్‌ నిర్వహించిన పలు పూజా కార్యక్రమాల్లో కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఉత్సాహంగా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు.