HomeTelugu Trendingగుడిలో 'ఖుషి' క్లైమాక్స్‌ షూటింగ్‌

గుడిలో ‘ఖుషి’ క్లైమాక్స్‌ షూటింగ్‌

Kushi shooting update

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ముస్లిం యువతి పాత్రలో సమంత, ఆమెను ప్రేమించే హీరో పాత్రలో విజయ్ కనిపించనున్నారు. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ తొలుత కొంత ఆలస్యం అయినా.. తర్వాత వరుస షెడ్యూల్స్‌ తో చిత్రీకరణ శరవేగంగా సాగింది. తాజాగా రాజమండ్రి సమీపంలోని ఓ దేవాలయంలో క్లైమాక్స్ సన్నివేశాల షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు సమచారం.

షూటింగ్ స్పాట్ లో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కుటుంబ సభ్యులంతా గుడిలో యాగం చేస్తుండగా చీరకట్టులో సమంత, పంచ కట్టుకున్న విజయ్ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటగా కనిపించారు. ఇద్దరూ చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించారు. ఇది ఎండ్ టైటిల్స్ పడే సీన్‌ లా ఉంది. దాంతో, సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్‌ 1న పలు భాషల్లో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!