ప్రజల నాడి ప్రజాకూటమి వైపే: కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రజల నాడి ప్రజాకూటమి వైపే ఉందని ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ చెప్పారు. వీరే విజేతలంటూ కొన్ని రోజుల క్రితం ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆయన.. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చారు. మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి వీరే విజేతలని చెప్పారు. ఈ ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగవని.. టఫ్‌ ఫైట్‌ ఉంటుందని వివరించారు. పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ రావొచ్చన్న లగడపాటి.. ఒకవేళ తగ్గితే మహాకూటమికి అనుకూలంగా ఉంటుందన్నారు. గత ఎన్నికల్లోలా పోలింగ్ 68.5 శాతం మాత్రమే నమోదు అయితేనే తన సర్వే అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని, పోలింగ్ శాతం పెరిగితే అంచనాలన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌జిల్లాలో టీఆర్‌ఎస్‌కు.. రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు అధిక్యం లభిస్తుందని చెప్పారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోటాపోటీగా ఎన్నికల జరుగుతాయన్నారు. హైదరాబాద్‌పాటు జిల్లాల్లో కూడా బీజేపీకి సీట్లు వస్తాయన్నారు. నగరంలో మజ్లిస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని వివరించారు.