HomeTelugu Big Stories'లక్ష్య' ట్రైలర్‌

‘లక్ష్య’ ట్రైలర్‌

Lakshya Trailer
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆర్చరీకి సంబంధించిన సన్నివేశాలు, నాయకానాయికల లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. నాగశౌర్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించారు.

‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అని హీరో పాత్రను తెలియజేసేలా జగపతిబాబు చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తోంది. ‘నేను వందమందికి నచ్చక్కర్లేదు సర్‌. కానీ నన్ను ఇష్టపడే ఈ ఒక్క వ్యక్తీ నన్ను వద్దనుకుంటే నేను గెలిచేది దేనికి సర్‌’ అని నాగశౌర్య చెప్పిన సంభాషణ హృదయాల్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu